IPL 2023: చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం

IPL 2023: లక్నో దూకుడుకు కళ్లెం వేసిన చెన్నై బౌలర్లు

Dhatripriya
Published on: 4 April 2023 7:34 AM IST
Chennai Super Kings Won A Match
X

IPL 2023: చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం

IPL 2023: చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయబావుటా ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చైన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కైల్ మేయర్స్, లోకేశ్ రాహుల్ పటిష్టమైన పునాది వేశారు. విజయ తీరం చేర్చాలనే తాపత్రయంతో ఆడిన ఆటతీరు అభిమానులను అలరించింది. విజయతీరం చేర్చే ప్రయత్నంలో ఒక్కొక్కరుగా పెవీలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టు 12 పరుగులు తేడాతో విజయం సాధించింది.

కైల్ మేయర్స్ 22 బంతుల్లో 8 బౌండరీలు, రెండు సిక్సర్లతో 53 పరుగులు, నికోలస్ పూరణ్ 32 పరుగులు, ఆయుష్‌ బదానీ 23 పరుగులు, మార్కస్ స్టాయిన్స్ 21 పరుగులు, లోకేశ్ రాహుల్ 20 పరుగులు అందించారు. ఆఖరి ఓవర్లో క్రిష్ణప్ప గౌతం, మార్క్ ఉడ్ మెరుపు షాట్లతో స్కోరు బోర్డును 205 పరుగులు మార్కును చేర్పించారు.

చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. కాన్వే 47 పరుగులు, శివందుబే 27 పరుగులు, అంబటి రాయుడు 27 పరుగులు సాధించారు. దూకుడు మీద ఆడుతున్న లక్నో ఆటగాళ్లను కట్టడి చేసి నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన చైన్నై ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story