RCB vs CSK: హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం

RCB vs CSK: 8 పరుగుల తేడాతో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

Dhatripriya
Published on: 18 April 2023 7:33 AM IST
Chennai Super Kings win in a close fight
X

RCB vs CSK: హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం

RCB vs CSK: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 200కి పైగా పరుగులు సాధించడంతో ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ వినోదం లభించినట్టయింది. రెండు జట్లలోని బ్యాటర్లు బంతికి చుక్కలు చూపించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఓ దశలో ఆర్సీబీ గెలుపు ఈజీనే అనిపించింది. అయితే, ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది. కోహ్లీ మొదట్లోనే అవుటైనా, కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ విధ్వంసం సృష్టించారు. ఇద్దరూ క్రీజులో ఉన్నంత సేపు బంతి స్టాండ్స్ లోకి వెళ్లింది. వీరిద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదడంతో చెన్నై బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చివర్లో దినేశ్ కార్తీక్, ప్రభుదేశాయ్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్లో బెంగళూరు విజయానికి 19 పరుగులు అవసరం కాగా... 10 పరుగులే ఇవ్వడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు.

Dhatripriya

Dhatripriya

Next Story