GT vs CSK: గుజరాత్ టైటాన్స్‌పై భారీ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

GT vs CSK: 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసిన చెన్నై

Shashank Gullapelli
Published on: 26 March 2024 9:49 PM IST
Chennai Super Kings Scored A Huge Score Against Gujarat Titans
X

GT vs CSK: గుజరాత్ టైటాన్స్‌పై భారీ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

GT vs CSK: గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా చెన్నై పరుగుల వరద పారించింది. ఆరంభం నుంచే చెన్నై బ్యాట్స్‌మెన్లు గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. శివం దూబే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెన్నై గుజరాత్ ముందు భారీ టార్గెట్‌ ఉంచింది. శివం దూబే 23 బంతుల్లో 51 పరుగులు చేయగా.. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, గైక్వాడ్ చెరో 46 పరుగులు చేశారు. రషీద్ ఖాన్‌ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మకు తలో వికెట్ దక్కింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story