IPL 2021 CSK vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన

IPL 2021: చెన్నై టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ సేన బౌలింగ్ చేయనుంది.

Venkata Chari
Updated on: 25 April 2021 4:58 PM IST
Chennai Super Kings Have won the Toss and Have Opted to Bat
X

టాస్ వేస్తున్న చెన్నై కెప్టెన్ ధోనీ (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు(ఆదివారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మేరకు చెన్నై టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ సేన బౌలింగ్ చేయనుంది.

ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్‌లాడిన బెంగళూరు.. నాల్గింటిలోనూ గెలుపొందింది. అపజయంలేని టీంగా మందుకు సాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీదుంది. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు, రెండో స్థానంలో ఉన్న చెన్నై టీంల మధ్య మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతోంది.

ప్లేయింగ్ లెవన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, అంబతి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్

Venkata Chari

Venkata Chari

Next Story