CSK vs SRH: చెపాక్‌లో చెన్నై జోరు.. హైద‌రాబాద్‌కు నాలుగో ఓటమి

CSK vs SRH: హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు

Jyothi
Published on: 22 April 2023 7:12 AM IST
Chennai Super Kings Defeat Hyderabad By 7 Wickets
X

CSK vs SRH: చెపాక్‌లో చెన్నై జోరు.. హైద‌రాబాద్‌కు నాలుగో ఓటమి

CSK vs SRH: చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జోరు కొన‌సాగించింది. ఆల్‌రౌండ్ షోతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్... చెన్నై బౌల‌ర్లు విజృంభించ‌డంతో 134 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత‌ చెన్నై జట్టులో డెవాన్ కాన్వే అర్థ శ‌త‌కంతో చెల‌రేగాడు. రుతురాజ్ గైక్వాడ్ క్లాసిక్ బ్యాటింగ్ ఆడాడు. చివరికి మోయిన్‌ అలీ బౌండ‌రీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దాంతో, సన్‌రైజర్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. నాలుగు విజ‌యాల‌తో CSK పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ఎగ‌బాకింది.

హైదరాబాద్‌ జట్టులో టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్‌ హ్యారీ బ్రూక్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారంతా వరుసగా క్యూ కట్టారు. ఆఖ‌ర్లో హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్‌సెన్ పోరాడ‌డంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది. చెన్నై బౌల‌ర్లలో ర‌వీంద్ర జ‌డేజా 3 వికెట్లు తీశాడు.

Jyothi

Jyothi

Next Story