Mahendra Singh Dhoni: అప్పటి వరకు ధోని సీఎస్కే లోనే ఉంటాడని భావిస్తున్నా.. సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్

Mahendra Singh Dhoni: అప్పటి వరకు ధోని సీఎస్కే లోనే ఉంటాడని భావిస్తున్నా.. సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్
x
MS Dhoni (File Photo)
Highlights

Mahendra Singh Dhoni: గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు.

Mahendra Singh Dhoni: గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు. గత ఏడాది కాలంగా క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న ధోని మళ్ళీ జట్టులోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ధోనీ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు.

ధోని కెప్టెన్సీలో భారత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2007 నుండి 2016 వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మరియు 2008 నుండి 2014 వరకు టెస్ట్ క్రికెట్లో ధోని జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. ఇక ప్రపంచంలోని అన్ని ఐసిసి ట్రోఫీలను సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనినే కావడం విశేషం. అయితే, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీతో మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ,

ఐపీఎల్ ప్రారంభమైన అప్పటినుండి జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. గతంలో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెనై ఫ్రాంచైజీపై రెండు సంవత్సరాలు షేధం విధించిన సమయంలో మాత్రం ధోనీ మరో జట్టుకు ఆడాల్సి వచ్చిందని.. ఆ ఒక్కటీ మినహా దోనీ అన్ని వేళల జట్టుకు అండగా నిలిచి జట్టు విజయాలు సదించడంలో కీలక పోషించి రెండు సార్లు కప్ ను గెలిచేలా చేసాడు. ధోనీ 2021, 2022 సీజన్ల వరకు సీఎస్కే జట్టుతోనే ఉంటాడని అనుకుంటున్నట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.

దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ధోని తన ప్రాక్టిస్ ను మొదలుపెట్టాడు. గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత మళ్ళీ ధోని జట్టులో కనిపించింది లేదు.. దాదాపుగా ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ కి ఆటగాళ్ళు ఆగస్టు 20 లోపే అక్కడికి చేరుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories