IPL 2022 - CSK vs RCB: ఎట్టకేలకు బోణి కొట్టిన చెన్నై.. బెంగళూరుపై థ్రిల్లింగ్ విక్టరీ...

IPL 2022 - CSK vs RCB: ఎట్టకేలకు బోణి కొట్టిన చెన్నై.. బెంగళూరుపై థ్రిల్లింగ్ విక్టరీ...
IPL 2022 - CSK vs RCB: బెంగళూరుపై 23 పరుగుల తేడాతో చెన్నై గెలుపు...
IPL 2022 - CSK vs RCB: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు రాబిన్ ఊతప్ప , శివమ్ దూబే రాణించడంతో ఏకంగా 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ డుప్లెసిస్, అనూజ్ రావత్, కోహ్లీ ముగ్గురూ నిరాశ పరిచారు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొంత ఆశలు రేపినా.. జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కాసేపు షాబాజ్ నదీమ్, సూయష్ ప్రభుదేశాయి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అదే సమయంలో కావలసిన రన్ రేట్ భారీగా పెరగకుండా కూడా జాగ్రత్త పడ్డారు. చివర్లో వానిందు హసరంగ, ఆకాష్ దీప్ అవుటైనప్పటికీ.. దినేష్ కార్తీక్ క్రీజులో ఉండటంతో బెంగళూరు విజయంపై పూర్తిగా ఆశలు చావలేదు. ఇలాంటి సమయంలో బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు డీకే ప్రయత్నించాడు. సరిగ్గా బౌండరీ లైన్ మీద దాన్ని జడేజా అందుకోవడంతో డీకే వెనుతిరిగాడు.
అప్పటి వరకు టెన్షన్ టెన్షన్‌గా ఉన్న చెన్నై అభిమానులు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్‌లో తొలిసారి విజయం నమోదు చేసింది. 23 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ 4, జడేజా 3 వికెట్లు తీయగా.. డ్వేన్ బ్రావో, ముకేష్ చౌదరి చెరో వికెట్ తీసుకున్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT