Shikhar Dhawan: చిక్కుల్లో శిఖర్‌ ధావన్‌.. వారణాసి కోర్టులో​ చార్జ్‌షీట్ దాఖలు

భారత క్రికెటర్ శిఖర ధావన్‌ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

Samba Siva Rao
Published on: 28 Jan 2021 6:23 PM IST
Shikhar Dhawan
X

Shikhar Dhawan

భారత క్రికెటర్ శిఖర ధావన్‌ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. ధావన్‌పై వారణాసి కోర్టులో చార్జ్‌షీట్‌​ దాఖలు అయింది. గతవారం వారణాసి పర్యటనుకు వెళ్లిన శిఖర్‌ ధావన్‌ సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీని సంబంధించిన ఓ ఫోటోను సామాజిక మాద్యమాల్లో షేర్ చేశాడు. అయితే దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్ పక్షులకు ఆహారం వేయడం ఏంటని సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

మందుగా వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిశిద్ధం. అయితే బోటులో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను ఎలా అనుమతిస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. వీటిపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు బోటు యాజమాని ఈ విషయం చెప్పాల్సిన బాద్యత ఉంది. అతను చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.

సిద్దార్థ్‌ శ్రీవాత్సవ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ వెల్లడించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story