Bumrah Marriage Date: బూమ్రా పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది

Bumrah Marriage Date: టీమిండియా పేసర్ జస్ర్పీత్ బుమ్రా పెళ్లిపై గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కు తెరపడింది.

Venkata Chari
Updated on: 13 March 2021 4:30 PM IST
Bumrah Marriage
X

బుమ్రా, సంజనా గణేశన్ (ఫైట్ ఫొటో)

Bumrah Marriage Date: టీమిండియా పేసర్ జస్ర్పీత్ బుమ్రా పెళ్లిపై గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కు తెరపడింది. మార్చి 14, 15వ తేదీల్లో గోవాలో బుమ్రా, టీవీ యాకంర్ సంజనా గణేశన్ ఒక్కటి కాబోతున్నట్లు యాక్టర్ తారా శర్మ సలుజా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కేవలం 20 మంది అతిధుల సమక్షంలో ఈ వివామ వేడుక జరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ తో బుమ్రా కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడని , ఇప్పడు పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం.

కాగా, జస్ర్పీత్ బుమ్రా గతంలో హీరోయిన్ రాశీఖన్నాతో లవ్‌లో ఉన్నాడని, ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదంది. ఇలా నిత్యం ఏదో ఒక న్యూస్ తో బుమ్రా సోషల్ మీడియాలో ఉంటూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇలాంటి రూమర్స్ కు ఇప్పటితో తెరపడనుంది.


Venkata Chari

Venkata Chari

Next Story