Gautam Gambhir: రాజకీయాలకు గౌతం గంభీర్ గుడ్ బై.. నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్..

Gautam Gambhir: భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 2 March 2024 11:07 AM IST
BJP MP Gautam Gambhir Quit Politics
X

Gautam Gambhir: రాజకీయాలకు గౌతం గంభీర్ గుడ్ బై.. నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్..

Gautam Gambhir: భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను ట్యాగ్ చేస్తూ గౌతమ్ గంబీర్ ట్వీట్ చేశాడు. తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘క్రికెట్‌పై దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మోదీ, అమిత్‌షాకు ధన్యవాదాలు’ అని గంభీర్ తెలిపారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీ సీటు నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంభీర్ ఆ తర్వాత ఎక్కువగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు. మరోవైపు రాజకీయాల కారణంగా క్రికెట్ కమిట్మెంట్ల విషయంలోనూ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఐపీఎల్ కమిట్మెంట్లు చూసుకోవాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం లేకపోవడం వల్లే గంభీర్ గుడ్ బై చెప్తున్నట్లు కూడా సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story