IPL 2021: బయో బుడగే కొంపముంచిదా?

Bio Bubble Failed in IPL 2021
x

ఐపీఎల్ 2021 నివరధికా వాయిదా (ఫొటో ట్విట్టర్)

Highlights

IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా ఆడిపోవడానికి కారణం... ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడమని అందరికీ తెలిసిందే.

IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా ఆడిపోవడానికి కారణం... ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడమని అందరికీ తెలిసిందే. అయితే, నేడు మరో విషయం బయటకు వచ్చింది. లీగ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరికీ టీకా వేయించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ప్లాన్ చేశారంట. కాగా, కోవిడ్ టీకా విషయంలో ఆటగాళ్లు వ్యతిరేకత చూపించడంతో.. వ్యాక్సిన్ విషయాన్ని పక్కన పెట్టిందంట. పటిష్టమైన బయో బుడగలో ఉన్నామని, ఏంకాదని ఆటగాళ్లు భావించారని తెలిసింది.

ఈ బయో బుడగలో ఉన్నంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే ఆటగాళ్లు మరో స్టేడియానికి వెళ్లారో.. అక్కడి నుంచి బయో బుడగ విఫలమైంది. ఆటగాళ్లకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐపీఎల్ నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలో వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ, సన్ రైజర్స్ హైదరాబాద్‌ టీంలో వృద్ధిమాన్‌ సాహా, దిల్లీ క్యాపిటల్స్ టీం లో అమిత్‌ మిశ్రాలకు కరోనా పాజిటివ్‌ గా నమోదైంది. దీంతో అసలుకే మోసం వచ్చింది. ఏకంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది.

వ్యాక్సిన వేయించుకునేందుకు ఆటగాళ్లు ఒప్పుకోలేదని, కారణం వారికి ఈ కరోనా వ్యాక్సిన్ పై అవగాహన లేకపోవడమేనని తెలిసింది. కాగా, కొన్ని ఫ్రాంచైజీలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆటగాళ్లను ఒప్పించాయంట. అయితే, టీకా తీసుకున్నంక ఫీవర్ వస్తుందని వారు భయపడ్డాదని తెలిసింది. బయో బుడగే సురక్షితమని వారు భావించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వైరస్ బారిన పడుతుండడంతో లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఏదేమైనా... కేవలం అవగాహన లేకపోవడంతో ఇంత పెద్ద తప్పిదం జరిగిందని ఇప్పుడు బాధపడుతున్నారంట ఆటగాళ్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories