Team India: భువనేశ్వర్‌ కుమార్‌ ఇంట్లో విషాదం

Team India: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 21 May 2021 10:48 AM IST
Team India: Bhuvneshwar Kumars Father Kiran Pal Singh Dies Of Cancer
X

Team India: భువనేశ్వర్‌ కుమార్‌ ఇంట్లో విషాదం

Team India: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ కన్నుమూశారు. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) గురువారం సాయంత్రం కన్నుముశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో కిమోథెరపీ చికిత్స కూడా చేయించుకుని ఇటీవలే ఇంటికి తిరిగొచ్చారు.

రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడినుంచి ముజఫర్‌నగర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి షిప్ట్‌ చేయగా.. చికిత్స తీసుకుంటూ నేడు సాయంత్రం మృతి చెందారు. కిరణ్‌ పాల్‌ సింగ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ విభాగంలో విధులు నిర్వర్తించారు. ఆరోగ్య కారణాల రిత్యా వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఆయన అప్పటినుంచి క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story