Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అవసరమైతే యూకే పంపించే యోచనలో..

Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అవసరమైతే యూకే పంపించే యోచనలో..

Arun Chilukuri
Updated on: 4 Jan 2023 3:34 PM IST
BCCI to Shift Rishabh Pant to Mumbai in an Air Ambulance
X

Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అవసరమైతే యూకే పంపించే యోచనలో..

Rishabh Pant: గతవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌ డెహ్రాడూన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రిషబ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ వివరాలను వెల్లడించారు. ''మెరుగైన వైద్యం కోసం క్రికెటర్‌ పంత్‌ను ఎయిర్‌ అంబులెన్స్‌లో ఇవాళ ముంబయికి తరలించే అవకాళం ఉంది'' అని శర్మ తెలిపారు.

పంత్‌ను ఇప్పటికే ఐసీయూ నుంచి ప్రైవేట్‌ వార్డుకు మార్చిన విషయం తెలిసిందే. ముంబయి తరలించి అక్కడ బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో కుడికాలు లిగ్మెంట్‌కు శస్త్రచికత్స నిర్వహిస్తారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే విదేశాలకు (యూకే) తరలించే అంశంపైనా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story