Ganguly: కోహ్లికి కోపం ఎక్కువ.. అతడి యాటిట్యూడ్ అంటే ఇష్టమంటున్న గంగూలీ

*తాజాగా గురుగ్రామ్‌లోని ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గంగూలీ.. విరాట్ కోహ్లీపై కీల‌క వ్యాఖ్య‌లు

Sandeep Reddy
Updated on: 19 Dec 2021 4:31 PM IST
BCCI  President Ganguly Comments on Virat Kohli
X

Ganguly: కోహ్లికి కోపం ఎక్కువ.. (ఫైల్ ఫోటో)

Ganguly - Virat Kohli: బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌ధ్య వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గురుగ్రామ్‌లోని ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గంగూలీ.. విరాట్ కోహ్లీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెట‌ర్ల‌లో మీకు ఎవ‌రి యాటిట్యూడ్ అంటే బాగా ఇష్ట‌మ‌ని గంగూలీని మీడియా అడిగిన ప్రశ్నకి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లి యాటిట్యూడ్ అంటే బాగా ఇష్ట‌మ‌ని.. విరాట్ కోహ్లికి కోపం ఎక్కువ అని, అత‌ను చాలా పోరాట‌ప‌టిమ‌ను చూపిస్తాడ‌ని తెలిపాడు.

ఇక అస‌లు జీవితంలో ఒత్తిడి అనేది ఉండ‌ద‌ని.. భార్య‌, గ‌ర్ల్‌ఫ్రెండ్ వంటి వాళ్ళే ఒత్తిడిలోకి నెడుతార‌ని దాదా స‌ర‌దాగా చెప్పుకొచ్చాడు. ఇక వ‌న్డే కెప్టెన్సీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు కూడా విరాట్ కి రెండు రోజుల ముందే చెప్పామ‌ని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఇద్ద‌రు కెప్టెన్లు ఉండటం కంటే ఆటగాళ్ళ మధ్య సమతుల్యత దెబ్బ‌తింటుంద‌నే విరాట్ ని వన్డే కెప్టెన్సీ నుండి త‌ప్పించామ‌ని బిసిసిఐ వివ‌ర‌ణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story