logo
క్రీడలు

BCCI: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ

BCCI Dismisses Virat Kohli Words
X

BCCI: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ

Highlights

BCCI: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్‌లోనే కోహ్లీ చెప్పాడంది.

BCCI: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్‌లోనే కోహ్లీ చెప్పాడంది. అప్పుడే వద్దని విరాట్‌కు చెప్పామని, తాము స్పందించలేదు అనడం అవాస్తవం అని తెలిపింది. కోహ్లీ తప్పుకుంటే మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుందన్న బీసీసీఐ వన్డేలకు ఒకరు టీ20లకు మరొకరికి కెప్టెన్సీ బాధ్యత అప్పగించాల్సి వస్తుందని, అది తమకు సమస్యగా మారుతుందని కోహ్లీకి చెప్పామంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని గంట ముందే చెప్పామనడం అవాస్తవం అని పేర్కొంది. వన్డేలకు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని గంగూలీ నేరుగా కోహ్లీతో చెప్పారని బీసీసీఐ స్పష్టం చేసింది.

Web TitleBCCI Dismisses Virat Kohli Words
Next Story