IPL 2021: ఇప్పట్లో ఐపీఎల్‌ కష్టమే - గంగూలీ

IPL 2021: ఐపీఎల్ లో ఆటగాళ్లకు కరోనా సోకడంతో 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 10 May 2021 9:49 AM IST
BCCI Chief Sourav Ganguly Says IPL Not Possible at this Moment
X
గంగూలీ (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఐపీఎల్ లో ఆటగాళ్లకు కరోనా సోకడంతో 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, మిగిలిన మ్యాచ్‌లు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్‌ నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతుందని, అది ముగిసిన తర్వాత జూలైలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని గంగూలీ వెల్లడించాడు.

శ్రీలంక పర్యటనలో టీం ఇండియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. దీంతో ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారింది. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story