IND vs SL: శ్రీలంకతో టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs SL: శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20, టెస్టు సిరీస్ కోసం BCCI భారత జట్టును ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 7:15 PM IST
BCCI Announces Indias T20I Squad
X

IND vs SL: శ్రీలంకతో టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs SL: శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20, టెస్టు సిరీస్ కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. టీ20, టెస్టు జట్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా, జస్ప్రీత్ బుమ్రా‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం వీరిద్దరూ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, ముంబై జట్లకు ఆడుతున్నారు.

అటు టెస్టు జట్టును సైతం BCCI ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభమన్ గిల్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ తివారీ ఉంటారని ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story