Team India: కెప్టెన్ గా రోహిత్.. కివీస్ తో బరిలోకి దిగే టీ20 జట్టు ఇదే

*భారత్ వేదికగా త్వరలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.

Sandeep Reddy
Updated on: 10 Nov 2021 12:42 PM IST
BCCI Announced Team India Squad For New Zealand T20 Series in India
X

Team India: కెప్టెన్ గా రోహిత్.. కివీస్ తో బరిలోకి దిగే టీ20 జట్టు ఇదే

Team India: భారత్ వేదికగా త్వరలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. చేతన్ శర్మ అధ్యక్షతన మంగళవారం సెలక్షన్ కమిటీ 16 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. ఇక విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకోవడంతో అందరూ ఊహించినట్టుగానే రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. నవంబర్ 17 నుండి 21 మధ్య జరగనున్న ఈ టీ20 సిరీస్ తరువాత ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

*మొదటి టీ20

నవంబర్ 17, జైపూర్

రాత్రి 7.30 నిమిషాలు

*రెండవ టీ20

నవంబర్ 19, రాంచీ

రాత్రి 7.30 నిమిషాలు

*మూడవ టీ20

నవంబర్ 21, కలకత్తా

రాత్రి 7.30 నిమిషాలు

* మొదటి టెస్ట్

నవంబర్ 25-29, కాన్పూర్

* రెండవ టెస్ట్

డిసెంబర్ 3-7, ముంబై

న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే టీమిండియా టీ20 జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

కివీస్ తో బరిలోకి దిగే టీ20 జట్టు ఇదే

Sandeep Reddy

Sandeep Reddy

Next Story