WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే భారత జట్టు ఇదే

WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Venkata Chari
Published on: 15 Jun 2021 10:55 PM IST
Bcci Announce Team India Squad For WTC Final
X

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం ఎనౌన్స్ చేసింది. జూన్‌ 18న ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ఫైనల్‌ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడుతూ న్యూజిలాండ్‌తో సమరానికి రెడీ అవుతున్నారు.

భారత జట్టు:

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, వృద్ధిమాన్‌ సాహా.


Venkata Chari

Venkata Chari

Next Story