బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
x
Highlights

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర‌్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాదని భారత్ క్రికెట్ బోర్డుకు తమ మద్దతు ప్రకటించింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర‌్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాదని భారత్ క్రికెట్ బోర్డుకు తమ మద్దతు ప్రకటించింది. బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబూర్‌ రెహ్మాన్‌ వందవ జయంతి సందర్భంగా వరల్డ్ ఎలెవన్, ఆసియా ఎలెవన్ జట్లతో మ్యాచ్ నిర్వహించాని ఆదేశ క్రికెట్ బోర్డు భావించింది. ఈ మేరకు ఐసీసీ కూడా అనుమతి తీసుకుంది. అందుకు ఐసీసీ కూడా అంగీకరించింది. పాక్ చెందిన ఆటగాళ్లు వద్దని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఇటీవలె శ్రీలంక పాకిస్తాన్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక పాకిస్థాన్ టెస్టు సిరీస్ విజయవంతంగా ముగియడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇషాన్ మని వివాదాస్పద వ్యాఖ‌్యలు చేశాడు. భారత్ లో క్రికెట్ ప్రమాదకరమని పాకిస్థాన్ రక్షణపరంగా బెటర్ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ కూడ ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్వహిరంచాలకున్న టీ20 మ్యాచ్ కు ఆసియా ఎలెవన్ నుంచి ఆటగాళ్లను పంపిచాలని ఐసీసీ సూచించింది. భారత్‌-పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఒకే జట్టులో కొనసాగే అవకాశం లేకపోవడంతో, పైగా భారత్ పాక్ దేశాల మద్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లు తీసుకోవాలని, పాక్ ఆటగాళ్లు వద్దని తీర్మానించింది. దీంతో బీసీసీఐ కూడా ఓ లేఖ పంపింది. బీసీసీఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆసియా ఎలెవన్‌ జట్టులో పాకిస్తాన్‌ క్రికెటర్లు లేరని స్పష్టం చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ - భారత ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. దీంతో ఆసియా ఎలెవన్ జట్టుకి భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు పాల్గొంటారు. వారిని బీసీసీఐ అధ్యక్షుడు ఎంపిక చేస్తారని..బీసీసీఐ కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌ తెలిపారు. దీంతో ఆసియా ఎలెవన్ జట్టుకి పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడితే భారత క్రికెటర్లను పంపమని బీసీసీఐ పరోక్షంగా బీసీబీకి కూడా చెప్పింది. దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు బీసీసీఐ వైపే మొగ్గు చూపింది. ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ టీ20 మ్యాచ్‌లు మార్చిలో నిర్వహించేదుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రణాళిక వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories