KKR Vs MI: KKR బ్యాట్స్‌మన్‌ పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నిం‍గ్స్‌

KKR Vs MI: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కమిన్స్‌

Rama Rao
Updated on: 7 April 2022 7:15 AM IST
Batsman Pat Cummins Sensational Innings
X

 KKR బ్యాట్స్‌మన్‌ పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నిం‍గ్స్‌

KKR Vs MI: ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR బ్యాట్స్‌మన్‌ పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నిం‍గ్స్‌ ఆడాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న కమిన్స్‌ ఎంట్రీతోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ధాటికి KKR 162 పరుగుల లక్ష్యాన్ని సింపుల్‌గా గెలుచుకుంది.

సంచలన ఇన్నింగ్స్‌తో కమిన్స్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కమిన్స్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. 14 బంతుల్లో కమిన్స్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 2108లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు. వీరి తర్వతి స్థానంలో యూసఫ్‌ పఠాన్‌ (2014లో 15 బంతుల్లో అర్థసెంచరీ కొట్టాడు. సునీల్‌ నరైన్‌ (2017లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకొని జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

Rama Rao

Rama Rao

Next Story