బుమ్రా షాట్‌.. ఆసీస్‌ బౌలర్‌కు తలకు గాయం!

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా-ఎ తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. అయితే మ్యాచ్ లో భాగంగా కామెరాన్ గ్రీన్ వేసిన బౌలింగ్ లో బుమ్రా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడడంతో ఆ షాట్ గ్రీన్‌ తలకు బలంగా తాకింది

Krishna
Published on: 11 Dec 2020 5:16 PM IST
బుమ్రా షాట్‌.. ఆసీస్‌ బౌలర్‌కు తలకు గాయం!
X

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా-ఎ తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. అయితే మ్యాచ్ లో భాగంగా కామెరాన్ గ్రీన్ వేసిన బౌలింగ్ లో బుమ్రా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడడంతో ఆ షాట్ గ్రీన్‌ తలకు బలంగా తాకింది. ఈ క్రమంలో గ్రీన్ అక్కడిక్కడే కూలబడ్డాడు. ఈ నేపధ్యంలో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న మహ్మద్‌ సిరాజ్ తన పరుగును పూర్తి చేయకుండా గ్రీన్ వద్దకి చేరుకున్నాడు. ఆ తర్వాత అంపైర్‌ వెంటనే ఫిజియోను రప్పించి కొన్ని పరీక్షల చేశారు. అనంతరం కామెరాన్ నడుచుకుంటూ మైదానాన్ని వీడాడు. గ్రీన్ ప్లేస్ లోకి ప్యాట్రిక్ రోవేను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నియమించారు.

అయితే ఇక్కడ రన్ కోసం చూసుకోకుండా తోటి ఆటగాడికి గాయం తగలగానే అతనికి ప్రాధాన్యం ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. అతన్ని నెటిజన్లు ప్రశంసలతో ముచ్చేత్తుతున్నారు. కాగా తొలి రోజు ఆటలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా పృథ్వీ షౠ(40), శుబ్‌మన్‌ గిల్‌(43) రాణించారు. కాగా మిగతా బ్యాట్స్ మెన్స్ త్వరత్వరగానే అవుట్ అయ్యారు. ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

Krishna

Krishna

Next Story