IPL 2022: ఐపీఎల్‌ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు

IPL 2022: *ఐపీఎల్‌లో అదరగొట్టిన బెంగళూరు *లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో జట్టు

Sriveni Erugu
Updated on: 26 May 2022 8:25 AM IST
Bangalore win in the IPL 2022
X

 IPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు 

IPL 2022: ఐపీఎల్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి ఎవరైనా బలాదూర్‌ అన్నట్లు విజృంభించింది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఆర్‌సీబీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. తొలుత రజత్‌ పాటీదార్‌ ధనాధన్‌ సెంచరీతో కదంతొక్కితే హాజిల్‌వుడ్‌ లక్నో జోరుకు బ్రేక్‌లు వేశాడు. హిట్టర్లు విఫలమైన వేళ పాటీదార్‌..ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించాడు. పటీదార్ 112 పరుగులతో మెరుపు శతకం బాదడంతో ఎలిమినేటర్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో పై విజయం సాధించింది. భారీ లక్ష్యఛేదనలో లక్నో పోరాటపటిమ కనబరిచినా..గెలుపు వాకిట బొక్కాబోర్లా పడింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story