Saina Movie Teaser: సైనా పాత్రలో పరిణితి ఇరగదీసింది

Saina Movie Teaser: ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ‘సైనా’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Venkata Chari
Published on: 4 March 2021 9:31 PM IST
Badminton Star Saina Nehwal Biopic Saina Teaser out
X

పరిణితి చోప్రా

Saina Movie Teaser: భారత దేశానికి బాట్మింటన్‌లో తొలి ఒలింపక్ పతకం తీసుకొచ్చిన ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథపై 'సైనా' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా కనిపించనుంది. ఈ పాత్ర కోసం పరిణితీ బాట్మింటన్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. దాంతో పాటు దాదాపు 10 కేజీ బరువు కూడా తగ్గింది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌కు తీసుకున్నారు. కానీ, ఇతర కారణాలవల్ల శ్రద్ధా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. పరిణితి చోప్రా.. సైనా నెహ్వాల్ దగ్గర కోచింగ్ తీసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు.

ఈ టీజర్‌లో పరిణితి చోప్రా నటన బాగుంది. సైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అని అనిపిస్తుంది. నెహ్వాల్ లాగే ఆటలో మంచి పరిణితి చూపింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిలో బాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒకరు. ఈమె ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తొలి బాట్మింటన్ క్రీడాకారిణి. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐదు పతకాలు.. అంతేకాదు అర్జున అవార్డుతో పాటు రాజీవ్ ఖేల్ రత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఈమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి.

కాగా, నిజ జీవితంలో ఎన్నో ఘనతలు సాధించిన సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ కు సిద్ధమైంది. మరి వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story