చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్..

ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును మూట కట్టుకుంది.
ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. ఫాలో ఆన్ తో రెండో ఇన్సింగ్స్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షాన్ మసూద్(68 పరుగులు, 127 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్) అసాద్ షఫీక్(57 పరుగులు,112 బంతుల్లో, ఐదు ఫోర్లు ), మహ్మద్ రిజ్వాన్(45)లు, మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమైయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 5 వికెట్లతో సత్తాచాటాడు. మరో బౌలర్ హజల్‌వుడ్ 2 వికెట్లు , మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కించుకున్నారు.
39/3 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ను మసూద్ షఫీక్‌లు మరో వికెట్ పడకుండా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కాగా, వీరిద్దరూ జోడిని లయన్ విడదీశారు దీంతో వరుస వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిజ్వాన్ కాసేపు ప్రతిఘటించారు. కానీ, ఆస్టేలియా బౌలర్ల ధాటికి చేతులేత్తేశారు.
రెండు టెస్టుల సిరీస్ కోల్పోయిన పాక్. మరో చెత్తరికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఐదో సారి 20 ఏళ్లుగా పాక్ ఒక్క టెస్టు మ్యాచ్ గెలవకపోవడం విశేషం. 1999 మూడు టెస్టు సిరీస్‌ల్లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించిన 3-0తో సిరీస్ కోల్పోయింది. 2004, 2009, 2016ల్లో సైతం ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌లను వైట్ వాష్ చేసింది. 2019లో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో పాకిస్తాన్ కోల్పోయింది. మొదటి టెస్టును ఇన్నింగ్స్ ఐదు పరుగులతో కోల్పోగా, రెండో టెస్టును ఇన్నింగ్స్ 48 పరుగులతో కోల్పోయింది.
ఈ సిరీస్ లో పాకిస్తాన్ కు కలిసోచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే యాసిర్ షా రూపంలో అని చేప్పాలి. మొదటి ఇంన్నిగ్స్ యాసిర్ షా ఒక వికెట్ కూడా తీయకుండా 197 సమర్పించుకున్నాడు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ 96/6తో కీలక వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్. టైలెండర్ యాసిర్ షా (113 పరుగులు, 213 బంతుల్లో ; 13 ఫోర్లు) రికార్డు నమోదు చేశాడు. 13 ఏళ్ల తర్వాత పాక్ తరపున ఏనిమిదో బ్యాట్స్‌మెన్ రూపంలో వచ్చి సెంచరీ నమోదు చేసిన యాసిర్ షా రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్ లోకూడా 42 పరుగులు చేసి పోరాటపటిమ చూపించాడు.
లైవ్ టీవి
దిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMTసైరా సినిమాలో పవన్ సీన్ అదే
9 Dec 2019 4:03 PM GMTమంత్రి కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి భేటీ
9 Dec 2019 3:54 PM GMT