IND vs AUS: భారత్‌తో 4 టెస్టుల మ్యాచ్ సిరీస్‌కు ఆసీస్ రెడీ

IND vs AUS: నాగ్‌పూర్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా టీమ్

Dhatripriya
Published on: 7 Feb 2023 9:48 AM IST
Australia Ready For 4 Test Match Series With India
X

IND vs AUS: భారత్‌తో 4 టెస్టుల మ్యాచ్ సిరీస్‌కు ఆసీస్ రెడీ

IND vs AUS: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా టీం ఇండియాకు చేరుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈనెల 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా టీం నాగ్‌పూర్‌కు చేరుకుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు ఈనెల 17 నుంచి ఢిల్లీలో జరుగుతుంది. ఇక మార్చి 1న ధర్మశాల, అదే నెల 9న అహ్మదాబాద్‌లో 3,4 టెస్టులు ప్రారంభమవుతాయి. అయితే భారత్‌తో తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ ఎడమకాలి గాయంలో నాగ్‌పూర్ టెస్టుకు దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 17న జరగనున్న తొలి వన్డేకు ముంబై, 19న జరగనున్న రెండో వన్డేకు విశాఖపట్నం, 22న జరగనున్న తుది వన్డేకు చెన్నై అతిథ్యం ఇవ్వనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story