Virat Kohli: కోహ్లికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆస్ట్రేలియా మీడియా.. ఫ్రంట్‌ పేజీలో ఫోటో, హిందీ, పంజాబీలో టైటిల్..

Virat Kohli: కోహ్లికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆస్ట్రేలియా మీడియా.. ఫ్రంట్‌ పేజీలో ఫోటో, హిందీ, పంజాబీలో టైటిల్..
X

Australia Newspaper Published Virat Kohli Photo with Hindi and Punjabi titles: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మీడియా గ్రాండ్‌ వెల్‌కమ్‌ తెలిపింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా విరాట్‌ కోహ్లి ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం విరాట్‌ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి వార్తా పత్రిక ఒకటి విరాట్ కోహ్లి ఫొటోను ఫ్రంట్‌ పేజీలో ప్రచురించింది. ఇక యశస్వి జైస్వాల్‌ ఫొటోను లోపలి పేజీలో పబ్లిష్‌ చేసింది.

ది టైలీ టెలిగ్రాఫ్‌ వార్తా పత్రిక కోహ్లి నిలబడి ఉన్న ఫొటోను ఫ్రంట్‌ కవర్‌ పేజీలో పబ్లిష్‌ చేసి.. ఏ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని పరుగులు, సెంచరీలు చేశాడు, సగటు ఎంత? అనే వివరాలను పేర్కొంది. ఇక అదే వార్తా పత్రిక యశస్వి జైస్వాల్‌ ఫొటోను ప్రచురించింది. గతంలో యశస్వి సెంచరీ చేసిన ఫొటోను పబ్లిష్‌ చేస్తూ.. 'న్యూ కింగ్‌' అనే హెడ్డింగ్‌ పెట్టింది. దీనికి హిందీ, పంజాబీ భాషలోనూ ఫాంట్లను జోడించడం విశేషం.

ప్రస్తుతం వార్తా పత్రికల క్లిప్లింగ్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. భారత క్రికెట్‌ అభిమానులు ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ టీమిండియాకు ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే భారత్ 4-0తో ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్‌ చేతిలో ఓడిన టీమీండియా ఆస్ట్రేలియాలో ఎలాంటి ఆటతీరు కనబరుస్తుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story