Steve Smith: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఫేవరేట్ టీమిండియానే

* ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియానే ఫేవరేట్ అని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తెలిపాడు.

Sandeep Reddy
Updated on: 21 Oct 2021 12:02 PM IST
Australia Cricketer Steve Smith Says Team India is T20World Cup 2021 Favourite
X

స్టీవ్ స్మిత్ (ట్విట్టర్ ఫోటో)

Steve Smith:ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియానే ఫేవరేట్ అని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తెలిపాడు. టీమిండియాలో అటు బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఆల్ రౌండర్ లు ఆటగాళ్ళతో పాటు మ్యాచ్ విన్నర్స్ కు కొదవలేదని చెప్పుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా యూఏఈలో మ్యాచ్ లు ఆడటంతో ఇక్కడి వాతావరణానికి టీమిండియా ఆడటానికి అలవాటుపడ్డారని అన్నాడు.

ఇక బుధవారం ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 152 పరుగులు చేయగా ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ కేవలం 17.3 ఓవర్లలో 153/1 లక్ష్యాన్ని చేధించి ఘనవిజయాన్ని సాధించింది. ఆసీస్ ఆటగాళ్ళలో స్టీవ్ స్మిత్ 57, మాక్స్ వెల్ 37, స్టోనిస్ 41 పరుగులు చేయగా.. టీమిండియా ఆటగాళ్ళు రోహిత్ శర్మ 60, కేఎల్ రాహుల్ 39, సూర్యకుమార్ యాదవ్ 38, హార్దిక్ పాండ్య 14 పరుగులు సాధించారు. అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story