Tim Paine: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ టిమ్ పెయిన్ రాజీనామా

* ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ టిమ్ పెయిన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు.

Sandeep Reddy
Published on: 19 Nov 2021 11:52 AM IST
Australi Test Cricket Team Captain Tim Paine Resigns as Captain Because of Chat Scandal
X

Tim Paine: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ టిమ్ పెయిన్ రాజీనామా

Tim Paine: ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ టిమ్ పెయిన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. 2017 లో ఆస్ట్రేలియా జట్టు కోసం పని చేసిన ఒక మహిళకు కొన్ని అసభ్యకర మెసేజ్ లతో పాటు కొన్ని ప్రైవేటు ఫోటోస్ పంపాడని తాజాగా ఆ మహిళ వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ ని బయటపెట్టింది. దీంతో టిమ్ పెయిన్ ఆసీస్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. డిసెంబర్ 8 నుండి బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లాండ్ తో మొదలుకానున్న అషేస్ సిరీస్ సమయంలో ఇలా పెయిన్ చాటింగ్ బయటికి రావడంతో పాటు అతడు కెప్టెన్సీ కి రాజీనామా చేయడం ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ అనే చెప్పాలి.

అషేస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరగనున్న అయిదు టెస్ట్ మ్యాచ్ లు 2021 డిసెంబర్ 8న మొదలై జనవరి 18 2022 న ముగియనున్నాయి. మరి టిమ్ పెయిన్ స్థానంలో ఎవరు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతారోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story