Asia Cup 2025: అభిమానులకు షాక్.. ఈ స్టార్ ప్లేయర్‎కు జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనా?

Asia Cup 2025 Star Finisher Rinku Singh
x

Asia Cup 2025: అభిమానులకు షాక్.. ఈ స్టార్ ప్లేయర్‎కు జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనా?

Highlights

Asia Cup 2025: అభిమానులకు షాక్.. ఈ స్టార్ ప్లేయర్‎కు జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనా?

Asia Cup 2025: టీమిండియా జట్టు సెలక్షన్ అంటేనే ఎప్పుడూ ఒకటే ఉత్కంఠ. ముఖ్యంగా ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లలో కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ చర్చ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందరి దృష్టి శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి పేర్లపై ఉన్నప్పటికీ, చివరి ఓవర్లలో సిక్సర్లతో చెలరేగే రింకూ సింగ్ సెలక్షన్ కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. జట్టులో ఫినిషర్ పాత్ర కోసం గట్టి పోటీ ఉండడంతో, రింకూ సింగ్ ఆసియా కప్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ప్రకారం, కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా, బౌలింగ్‌లో కూడా రాణించగల ఆల్ రౌండర్లకే జట్టులో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. జట్టులో ఇప్పటికే ఫినిషర్ పాత్ర కోసం హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలరు. అదే రింకూ సింగ్ అయితే కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం.

శివమ్ దూబేకి గాయం అయితే, అతని స్థానంలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల వాషింగ్టన్ సుందర్, లేదా బ్యాకప్ వికెట్ కీపర్ పాత్ర పోషించగల జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. ఈ పరిణామాలు రింకూ సింగ్‌కు ఆసియా కప్ అవకాశాలను తగ్గించేస్తున్నాయి. గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రసెల్ తర్వాత రింకూ సింగ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. దీంతో అతను తక్కువ బంతులు ఆడాడు.

ఐపీఎల్ 2023లో 5 సిక్సర్లతో చెలరేగిన రింకూ, ఆ తర్వాత అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. గత రెండు సీజన్‌లలో మొత్తం కలిపి 300 బంతులు కూడా ఆడలేకపోవడం అతని ఫామ్‌పై సందేహాలు పెంచింది.

రింకూ సింగ్ గణాంకాలు

రింకూ 33 టీ20 మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్‌లో ఆడి 42 సగటుతో 546 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 161గా ఉంది, ఇది ఒక ఫినిషర్‌కు చాలా మంచి గణాంకం. ఈ గణాంకాలు బాగున్నప్పటికీ, జట్టులో ఆల్ రౌండర్‌లకే ప్రాధాన్యత ఇస్తుండడం, ఐపీఎల్‌లో ఆశించినంతగా రాణించలేకపోవడం వంటి కారణాల వల్ల రింకూ సింగ్ ఎంపిక ఇప్పుడు గందరగోళంలో పడింది. ఆసియా కప్ కోసం జట్టును ఆగస్టు 19 లేదా 20న ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories