Shreyas Iyer: ఆసియా కప్‎కు భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు ఇప్పటికీ అవకాశం ఉందా?

Asia Cup 2025 Is there Still a Chance for Shreyas Iyer in the Indian Squad
x

Shreyas Iyer: ఆసియా కప్‎కు భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు ఇప్పటికీ అవకాశం ఉందా?

Highlights

Shreyas Iyer: ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, సీనియర్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్​కు ఈ జట్టులో చోటు దక్కలేదు.

Shreyas Iyer: ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, సీనియర్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్​కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇది టీమ్ ఇండియా అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అయ్యర్ తప్పకుండా టీమ్‌లో ఉంటాడని వారు ఆశించారు. కానీ, టీమ్ ప్రకటన తర్వాత కూడా శ్రేయాస్ అయ్యర్ టీమ్‌లోకి రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నియమాల ప్రకారం.. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

గాయపడిన ప్లేయర్ స్థానంలో అవకాశం

ఏసీసీ నియమం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికీ భారత జట్టుతో చేరవచ్చు. నియమం ఏమిటంటే, ఒకవేళ ఏ జట్టులోని ఆటగాడైనా గాయపడితే లేదా జట్టు మేనేజ్‌మెంట్‌కు ఒక ఆటగాడిని మార్చాలని అనిపిస్తే, అతని స్థానంలో మరొక ఆటగాడిని టీమ్‌లోకి తీసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం, స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక కాని ఆటగాళ్లకు కూడా జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు లేదా ఆసియా కప్ 2025 సమయంలో భారత జట్టులోని ఏ ఆటగాడైనా గాయపడితే, శ్రేయాస్ అయ్యర్ తిరిగి టీమ్‌లోకి రావచ్చు.

శ్రేయాస్ అయ్యర్ టీ20 గణాంకాలు

శ్రేయాస్ అయ్యర్ టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ మంచి ప్రదర్శన ఇస్తూనే వచ్చారు. దీనికి ఉదాహరణగా, గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. బ్యాటింగ్‌లో కూడా అదరగొట్టిన అయ్యర్, ఆడిన 17 మ్యాచ్‌లలో 50.33 సగటుతో 604 పరుగులు సాధించారు. అలాగే, టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్ తరఫున 51 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్, 30.66 సగటుతో 1104 పరుగులు చేశారు. అతని పేరు మీద ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా, అతను 240 టీ20 మ్యాచ్‌లు ఆడి, 34.08 సగటుతో 6578 పరుగులు చేశారు. ఇందులో అతని అత్యధిక స్కోరు 147 రన్స్. అయ్యర్ ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories