US Open 2025: చరిత్ర సృష్టించిన అర్యానా సబలెంకా.. యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం!

US Open 2025: చరిత్ర సృష్టించిన అర్యానా సబలెంకా.. యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం!
x
Highlights

US Open 2025: చరిత్ర సృష్టించిన అర్యానా సబలెంక. ఫామ్‌ కొనసాగిస్తూ.. ప్రస్తుత మహిళల టెన్నిస్‌లో హార్డ్‌ కోర్టులో తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ.. మరోసారి యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయింది.

US Open 2025: చరిత్ర సృష్టించిన అర్యానా సబలెంక. ఫామ్‌ కొనసాగిస్తూ.. ప్రస్తుత మహిళల టెన్నిస్‌లో హార్డ్‌ కోర్టులో తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ.. మరోసారి యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా.. అమెరికాకు చెందిన అనిసిమోవాను ఓడించింది. సబలెంక వరుసగా రెండు యూఎస్ టైటిళ్లు సాధించి చరిత్ర తిరగ రాసింది. యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సబలెంకాకు 44 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. మ్యాచ్‌లో ఆధిపత్యం సబలెంకాదే అయినా.. అనిసిమోవా తన పోరాటంతో ఆకట్టుకుంది.

సబలెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023, 24, యుఎస్‌ ఓపెన్‌ 2024, 2025లో రెండేసి టైటిళ్లు గెలిచింది. ఇప్పటిదాకా సబలెంకా గెలిచిన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఈ కోర్టుల్లో సాధించినవే. హార్డ్‌ కోర్టుల్లో 2023 నుంచి మొదలైన సబలెంకా ప్రస్థానం ఇప్పటికి అప్రతిహతంగా సాగుతోంది. 27 ఏళ్ల ఈ బెలారస్‌ అమ్మాయి.. గత మూడేళ్ల నుంచి హార్డ్‌కోర్టుల్లో ఆడిన 41 మ్యాచ్‌ల్లో 39 గెలిచింది. యుఎస్‌ ఓపెన్లో చివరి మూడేళ్లూ ఆమె ఫైనల్‌కు వచ్చింది. 2023 టోర్నీ తుదిపోరులో కొకో గాఫ్‌ చేతిలో పరాజయం చవిచూసిన సబలెంకా.. అక్కడే వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. చరిత్రలో వరుసగా ఆరు హార్డ్‌కోర్టు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన మూడో ప్లేయర్‌ సబలెంకా. తన విజయానికి కోచ్‌ ఆంటోన్‌ డబ్రోవ్, ప్రాక్టీస్‌ భాగస్వామి ఆండ్రి వెస్లెవ్‌స్కీ, ఫిట్‌నెస్‌ కోచ్‌ జేసర్‌ స్టాకీ.. సబలెంకాకు మద్దతుగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories