ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్‌!

Arjun Tendulkar Looking to Move from Mumbai to Goa
x

ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్‌!

Highlights

Arjun Tendulkar: ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న అర్జున్ టెండూల్కర్ ఇకపై గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు.

Arjun Tendulkar: ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న అర్జున్ టెండూల్కర్ ఇకపై గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల సచిన్ తనయుడు 2020-21 సీజన్‌లో ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు ముంబైకి గుడ్‌బై చెప్పేసి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు అర్జున్ టెండూల్కర్ ప్రతినిధి తెలిపారు. అర్జున్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, ముంబైతోనే ఉంటే అది సాధ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు, అర్జున్ టెండూల్కర్ గోవాకు ప్రాతినిధ్యం వహించనున్న విషయాన్ని గోవా క్రికెట్ సంఘం నిర్ధారించింది. అర్జున్ రాకతో లెఫ్టార్మ్ స్పిన్నర్ కొరత తీరడంతో పాటు మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ల బలం పెరుగుతుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories