Arjun Tendulkar: ప్రముఖ వ్యాపార వేత్త మనవరాలితో సచిన్ కొడుకు ఎంగేజ్మెంట్ ?

Arjun Tendulkar: ప్రముఖ వ్యాపార వేత్త మనవరాలితో సచిన్ కొడుకు ఎంగేజ్మెంట్ ?
x

Arjun Tendulkar: ప్రముఖ వ్యాపార వేత్త మనవరాలితో సచిన్ కొడుకు ఎంగేజ్మెంట్ ?

Highlights

Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు ఊపందుకున్నాయి.

Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు ఊపందుకున్నాయి. ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలితో అర్జున్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇందుకు సంబంధించి టెండూల్కర్ కుటుంబం గానీ, ఆ అమ్మాయి కుటుంబం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు సానియా చందోక్. ఈమె ముంబైలోని ప్రసిద్ధ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఘాయ్ కుటుంబానికి హాస్పిటాలిటీ, ఆహార రంగంలో పెద్ద పేరుంది. ఇంటర్‌కాంటినెంటల్ మెరీన్ డ్రైవ్ హోటల్‌, పాపులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ది బ్రూక్లిన్ క్రీమరీ వంటివి వీరికి చెందినవే.

సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె కేవలం వ్యాపార కుటుంబానికి చెందినవారు మాత్రమే కాదు, స్వతహాగా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ముంబైలో మిస్టర్ పాస్ అనే పేరుతో ఒక ప్రీమియం పెట్ సెలూన్, స్పా, స్టోర్‌ను ఆమె నడుపుతున్నారు. సానియా, అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌కు మంచి స్నేహితురాలు కూడా. ఈ స్నేహం ద్వారానే అర్జున్, సానియాల పరిచయం ప్రేమగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుక చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జరిగింది.

అర్జున్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్‌లో స్థిరపడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం అతను రంజీ ట్రోఫీలో గోవా జట్టు తరపున ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ, అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఇప్పటివరకు అర్జున్ 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 37 వికెట్లు పడగొట్టి, 532 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 25 వికెట్లు, 102 పరుగులు సాధించాడు. 24 టీ20 మ్యాచ్‌లలో 27 వికెట్లు, 119 పరుగులు చేశాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఒక మంచి ఆల్ రౌండర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories