Anushka Sharma Friend: అనుష్క శర్మ ఫ్రెండ్ పై నెట్టింట్లో ఆసక్తి.. ఎవరీ మాలవికా నాయర్

Anushka Sharma Friend
x

Anushka Sharma Friend: అనుష్క శర్మ ఫ్రెండ్ పై నెట్టింట్లో ఆసక్తి.. ఎవరీ మాలవికా నాయర్

Highlights

Anushka Sharma Friend: విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సంబంధించిన ఓ ఫ్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె ఎవరు, ఏం చేస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.

Anushka Sharma Friend: విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సంబంధించిన ఓ ఫ్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె ఎవరు, ఏం చేస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆమెను ఫాలో అవుతున్న వారి లిస్టులో పెద్ద పెద్ద పేర్లు ఉండడం ఆశ్చర్యకరం. అనుష్క ఫ్రెండ్ కాబట్టి విరాట్ కోహ్లీ ఫాలో అవుతాడులే అనుకోవచ్చు. కానీ, వారిద్దరే కాదు.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బాయ్‌ఫ్రెండ్ పలాష్ ముచ్ఛల్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధోనీ భార్య సాక్షి ధోనీ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

ఎవరీ మాలవికా నాయర్!

అసలు అనుష్క శర్మ ఆ ఫ్రెండ్ ఎవరు? ఆమె పేరు ఏమిటి? ఏం చేస్తుంది? అనుష్క శర్మ ఆ స్నేహితురాలి పేరు మాలవికా నాయర్. ఈమె RCB, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌ (IPL 2025) సందర్భంగా కెమెరా కంటికి చిక్కారు. పంజాబ్ కింగ్స్‌పై క్వాలిఫైయర్ 1 గెలిచి, RCB ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకున్నప్పుడు జరిగిన సంబరాల్లో కూడా మాలవికా నాయర్ కనిపించారు. దీంతో ఆమె ఎవరు అన్న చర్చ మొదలైంది.



అనుష్క-మాలవికల మధ్య పాత స్నేహం

మాలవికా నాయర్, అనుష్క శర్మకు చాలా కాలంగా స్నేహితురాలు. కేవలం క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు కూడా వీరిద్దరూ కలిసి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ కనిపించారు. ఇదే ఐపీఎల్ సీజన్‌లో RCB, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడినప్పుడు కూడా మాలవిక అక్కడ కనిపించింది. ఇది వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేస్తుంది.

మాలవికా నాయర్ నేపథ్యం

మాలవికా నాయర్ లింక్‌డిన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆమె మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం ఆమె ఇనోజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నారు. మాలవికా నాయర్, నిఖిల్ సోసాలేను వివాహం చేసుకున్నారు. నిఖిల్ సోసాలే RCB క్రికెట్ టీమ్ రెవెన్యూ, మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. అనుష్క, విరాట్, మాలవికా, నిఖిల్ గతంలో కూడా కలిసి కనిపించారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories