Top
logo

Anushka Sharma, Virat Kohli : తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి!

Anushka Sharma, Virat Kohli : తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి!
X

Anushka Sharma, Virat Kohli 

Highlights

Anushka Sharma, Virat Kohli : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి త్వరలో తండ్రి కాబోతున్నాడు.. ఈ సంతోషకరమైన విషయాన్ని కొద్ది సేపటి క్రితమే ట్విట్టర్

Anushka Sharma, Virat Kohli : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి త్వరలో తండ్రి కాబోతున్నాడు.. ఈ సంతోషకరమైన విషయాన్ని కొద్ది సేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు కోహ్లి.. జనవరి 2021 వరకు మేము ముగ్గురం కాబోతున్నాం.. అంటూ తన భార్య అనుష్క శర్మతో ఉన్న ఫోటోను జతపరిచాడు.. అటు అనుష్క శర్మ కూడా ఇదే ట్వీట్ చేసింది. ఇందులో అనుష్క శర్మ గర్భిణిగా ఉండడం మనం చూడవచ్చు.. దీనితో అభిమానులు తోటి క్రికెటర్లు, బాలీవుడ్ సినీ తారలు ఈ దంపతులకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 2017 డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం కరోనా వలన క్రికెట్ మ్యాచ్ లు లేకపోవడంతో పూర్తిగా ఇంటికే తన సమయాన్ని కేటాయించాడు కోహ్లి.. త్వరలో సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో దానికి సిద్దం అవుతున్నాడు కోహ్లి.. ఇక కోహ్లి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..Web TitleAnushka Sharma, Virat Kohli Expecting Their First Child, Announce Pregnancy With Adorable Pic
Next Story