Anushka Sharma: వామిక ఫోటోలు బయటపెట్టనందుకు ధన్యవాదాలు

Sandeep Reddy
Published on: 20 Dec 2021 5:00 PM IST
Anushka Sharma Thanks to Media For Not Publishing the Photos of her Daughter Vamika
X

Anushka Sharma: వామిక ఫోటోలు బయటపెట్టనందుకు థాంక్స్(ట్విట్టర్ ఫోటో)

Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా మీడియాకి ధన్యవాదాలు తెలిపింది. టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డిసెంబర్ 16న బయలుదేరింది. అయితే అదే సమయంలో ముంబై ఎయిర్ పోర్ట్ వద్ద విరాట్ కోహ్లి - అనుష్కతో పాటు ఉన్న కుమార్తె వామిక ఫోటోలను తీయడానికి అక్కడున్న మీడియా ప్రయత్నించారు. దీంతో విరాట్ కోహ్లి తన కూతురి ఫోటోలను ఎవరూ తియ్యోద్దని అంతేకాకుండా ఆ ఫోటోలను కూడా ఎక్కడ పోస్ట్ చెయ్యొద్దని విరాట్ కోహ్లి మీడియాని కోరాడు.

ఇక కోహ్లి అభ్యర్ధనని గౌరవించిన జర్నలిస్టులు వామిక ఫోటోలను ఎక్కడ బయటపెట్టకపోవడంతో తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా మీడియాకి, ఫోటోగ్రాఫర్లకు థాంక్స్ చెబుతూ భవిష్యత్తులో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని.. వామిక ఫోటోలను బయటపెట్టకుండా ఉన్నందుకు మీడియాకి ఎప్పటికీ ఋణపడి ఉంటామని అనుష్క శర్మ తెలిపింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్ళు నెట్ ప్రాక్టీసులో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story