IPL 2023: గుజరాత్ ఖాతాలో మరో విజయం

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్

Dhatripriya
Published on: 5 April 2023 8:00 AM IST
Another Victory In Gujarats Account
X

IPL 2023: గుజరాత్ ఖాతాలో మరో విజయం

IPL 2023: ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. సాయి సుదర్శన్ 62 పరుగులతో రాణించగా.. చివర్లో మిల్లర్ మెరుపులతో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఓపెనర్ వార్నర్ 37 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ 30, అక్షర్ పటేల్ 36 రన్స్ చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story