IPL 2021: ముంబై ఇండియన్స్ మరో ఉత్కంఠభరిత విజయం

IPL 2021: న్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలుపు అంచుల నుంచి పడదోసి విజయాన్ని కైవసం చేసుకుంది.

Sandeep Eggoju
Published on: 18 April 2021 6:42 AM IST
Another Thrilling win to Mumbai Indians Team
X
ముంబై ఇండియన్స్ (ఫైల్ ఇమేజ్)

IPL 2021: ముంబై ఇండియన్స్ మరో ఉత్కంఠభరింత విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలుపు అంచుల నుంచి పడదోసి విజయాన్ని కైవసం చేసుకుంది. 150 పరుగులను కాపాడుకుంటూ ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కాగా.. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రౌజర్స్‌.. 19.4 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 13 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తొలుత సూపర్ ఓపెనింగ్ దక్కినా, మిడిలార్డర్ దారుణ వైఫల్యంతో గెలుపునకు దూరమైంది. జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(37: 34 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా ఆటగాళ్లెవరూ అంచనాలకు తగినట్లు రాణించకపోవడంతో సన్‌రైజర్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story