టెస్ట్ సిరీస్ కి ముందే ఆసీస్ కి ఎదురుదెబ్బ!

టెస్ట్ సిరీస్ కి ముందే ఆసీస్ కి ఎదురుదెబ్బ!
x
Highlights

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందే ఆసీస్ కి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరం కాగా, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ సీన్ అబౌట్ ఈ సిరీస్ కి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందే ఆసీస్ కి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరం కాగా, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ సీన్ అబౌట్ ఈ సిరీస్ కి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్‌ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే సీన్ అబౌట్ బౌలింగ్ కి రాలేడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఒకవేళ అతనికి అయిన గాయం పెద్దదైతే మాత్రం ఆసీస్ ఓ కీలక బౌలర్ ని కోల్పోయినట్టే అవుతుంది.

సిడ్నీ వేదికగా భారత్ తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలోని మొదటి సెషన్‌లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్‌ కేవలం ఓవర్లు వేశాడు. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్‌ చేయలేదు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు సీన్ అబౌట్.. అటు ఆసీస్ మరో ఓపెనర్ విన్‌ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories