సీఎం జగన్‌ను కలిసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, అంబటి రాయుడు..

Ambati Rayudu Meets AP CM Jagan
x

సీఎం జగన్‌ను కలిసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, అంబటి రాయుడు..

Highlights

Ambati Rayudu: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు కలిసారు.

Ambati Rayudu: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు కలిసారు. ఇటీవల ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్, ట్రోఫీని ముఖ్యమంత్రికి సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు సీఎంకు చూపించారు.

అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ను సీఎం అభినందించారు. సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్‌కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories