ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన హైదరాబాద్ కుర్రాడు

4 Franchises Competing For Tilak Varma
x

ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన హైదరాబాద్ కుర్రాడు

Highlights

Tilak Varma: తిలక్ వర్మ కోసం పోటీ పడ్డ 4 ప్రాంచైజీలు, రూ1.70 కోట్లతో తిలక్ వర్మను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.

Tilak Varma: IPL -2022 మెగా వేలంలో హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద‌ర‌గొట్టాడు. ఇటీవ‌ల ముగిసిన అండ‌ర్‌-19 వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో విజేత‌గా నిలిచిన టీమిండియా జ‌ట్టులో ఉన్న తిలక్ వ‌ర్మ ను సొంతం చేసుకోవ‌డానికి వేలంలో నాలుగు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి.20 లక్షల బేస్ ప్రైజ్‌తో తిల‌క్ వ‌ర్మ వేలంలోకి రాగా... మొద‌ట స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బిడ్ చేసింది. అనంత‌రం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కూడా పోటీ ప‌డ‌టంతో తిల‌క్ వ‌ర్మ ధ‌ర 50 ల‌క్షలు దాటింది. ఇక్కడ హైద‌రాబాద్ త‌ప్పుకోగా... రాజ‌స్తాన్‌కు పోటీగా చెన్నై సూప‌ర్ కింగ్స్ వేలం రేసులోకి వ‌చ్చింది. కాసేప‌టికి రాజ‌స్తాన్ త‌ప్పుకోగా... చెన్నై దాదాపుగా తిలక్ వ‌ర్మను ద‌క్కించుకునేది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.

స‌డెన్‌గా పోటీలోకి వ‌చ్చిన ముంబై ఇండియ‌న్స్ దెబ్బకు తిల‌క్ వ‌ర్మ ధ‌ర సెక‌న్లలో కోటి రూపాయ‌ల‌కు చేరుకుంది. ఈ 19 ఏళ్ల కుర్రాడి కోసం ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ ప‌డ‌గా... చివ‌ర‌కు కోటి 70 లక్షలకు రోహిత్ టీమ్‌కు సొంతమ‌య్యాడు. 2022 ఐపీఎల్‌లో తిల‌క్ వ‌ర్మ ముంబై త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. 19 ఏళ్ల తిల‌క్ వ‌ర్మ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇప్పటి వ‌ర‌కు 16 మ్యాచ్‌ల్లో 784 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, మూడు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. 156 నాటౌట్ ఇత‌డికి అత్యధికం. ఇక టి20 కెరీర్‌లో 15 మ్యాచ్‌ల్లో 381 ప‌రుగులు చేశాడు. అత్యధిక స్కోరు 75 కాగా... 143.77 స్ట్రయిక్ రేట్‌తో ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ఓపెన‌ర్‌గా వ‌చ్చి దూకుడుగా ఆడ‌గ‌ల సత్తా తిల‌క్ వ‌ర్మ సొంతం. రోహిత్ శర్మ సార‌థ్యంలో తిల‌క్ వ‌ర్మ మ‌రింత రాటుదేలే అవ‌కాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories