WWE Superstar Spectacle: నేడు హైదరాబాద్ లో తొలిసారి WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పోటీలు

2023 WWE Superstar Spectacle in Hyderabad
x

WWE Superstar Spectacle: నేడు హైదరాబాద్ లో తొలిసారి WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పోటీలు 

Highlights

WWE Superstar Spectacle: గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్

WWE Superstar Spectacle: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న WWE పోటీలు మొదటిసారి హైదరాబాద్ లో జరగనున్నాయి. మొదటి సారి భారత్ లో 2016 లో WWE పోటీలు జరగగా తిరిగి 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఈ పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు రాత్రి జరగబోయే WWE మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో తమ అభిమాన ఫైటర్లను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories