IPL 2023: నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్‌ షురూ.. తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది.

Arun Chilukuri
Published on: 31 March 2023 3:33 PM IST
2023 Indian Premier League From Today
X

IPL 2023: నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్‌ షురూ.. తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది గుజరాత్. ఇక ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టాస్‌ తర్వాత తుది జట్టు వెల్లడి వైడ్‌, నోబాల్స్‌కు సమీక్ష విధానం, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఇలా ఎన్నో కొత్త నిబంధనలు రానున్నాయి. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరగలేదు.

దీంతో ఈ సారి సీజన్‌ ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటీమణులు రష్మిక మంధాన, తమన్నా భాటియా నృత్యాలతో అలరించబోతున్నారు. స్టార్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించనున్నాడు. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభవుతాయి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story