గ్రహాల కదలికల్లో మార్పులు.. జూన్‌లో ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే.. అందులో మీరున్నారా?

బుధుడు జూన్ 07న వృషభరాశిలోకి అలాగే మిథునరాశిలోకి జూన్ 24న ప్రవేశించనున్నాడు. కాగా, జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు జెమినీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. జూన్ 17న శని గ్రహం కుంభరాశిలోకి తిరోగమనం చేయనున్నాడు.

Arun Chilukuri
Updated on: 24 May 2023 7:00 AM IST
Zodiac Signs Lucky for These Zodiac Signs in June With Sun Mercury Saturn and Mars Changes of Planets
X

గ్రహాల కదలికల్లో మార్పులు.. జూన్‌లో ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే.. అందులో మీరున్నారా?

Rasi Phalalu: జ్యోతిష్యాన్ని చాలామంది నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ, ప్రతినెలా తమ జీవితాల్లో ఏం జరగనుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకు విరుద్ధంగా కొంతమంది మాత్రం అస్సలు నమ్మరు. ఏది ఏమైనా నిపుణుల ప్రకారం గ్రహాల ప్రభావం మనుషులపై తప్పక ఉంటుందని చెబుతుంటారు. దీంతో కొన్నిరాశుల వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటే.. మరికొంతమందికి అశుభఫలితాలు కలుగుతాయి.

బుధుడు జూన్ 07న వృషభరాశిలోకి అలాగే మిథునరాశిలోకి జూన్ 24న ప్రవేశించనున్నాడు. కాగా, జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు జెమినీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. జూన్ 17న శని గ్రహం కుంభరాశిలోకి తిరోగమనం చేయనున్నాడు. వీటితోపాటు 30న అంగారకుడు సింహరాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మార్పుల వల్ల కొంతమంది జీవితాల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మేషరాశి: శని తిరోగమనం వల్ల ఉద్యోగులకు ఎంతో కలిసి వస్తుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు అవకాశం ఉంది. అనుకోని లాభాలు అందుకుంటారు.

మకరరాశి: శని తిరోగమనం వల్ల ఈ రాశి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. కోర్టు కేసుల ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే కుటుంబంలో ప్రతికూలతలు తొలగిపోతాయి. బంధాలు బలంగా మారతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభ ఫలితాలు దక్కుతాయి.

తులారాశి: ఈ రాశి వారి వ్యాపారంలో గణనీయమైన లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం కూడా అనుకూలంగా మారుతుంది. సంతానప్రాప్తి విషయంలో శుభవార్త వింటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ వద్దకు చేరుకుంటుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ప్రజల విశ్వాసాలు, సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు అందించాం. ఇది నిజమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

Arun Chilukuri

Arun Chilukuri

Next Story