పెళ్లిలో మూడు ముళ్ళు, ఏడు అడుగులు ఎందుకు ?

పెళ్లిలో మూడు ముళ్ళు, ఏడు అడుగులు ఎందుకు ?
x
Highlights

భారతీయ హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పెళ్లిలో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి.

భారతీయ హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పెళ్లిలో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఇందులోని కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి ఈ నాటి జనరేషన్ కి అంతగా తెలియకపోవచ్చు. కానీ తెలుసుకావాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది. ఇక ఈ పెళ్లిలో రెండు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అవి "మూడు ముళ్ళు, ఏడు అడుగులు".. ఇందులో చాలా మందికి వరుడు వధువు మేడలో మూడు ముళ్ళు మాత్రమే ఎందుకు వేస్తాడు, ఇద్దరు కలిసి హోమం చూట్టూ ఏడు అడుగులే ఎందుకు నడుస్తారు అన్నది తెలుయకపోవచ్చు...

మూడు ముళ్ళు :

మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! "

ఇక మన హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరమని భావిస్తారు. అందుకే ఈ మంగళ సూత్రానికి మూడుముళ్ళు వేస్తారు. వివరంగా చెప్పాలంటే మానవులకు స్థూల ,సూక్ష్మ,కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది. పెళ్ళంటే ఒక్క భాహ్యశరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవడం అనే అర్ధంలో ఈ మూడు ముళ్ళు వేస్తారట..

మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు.

ఏడు అడుగులు :

ఇక తాళి కట్టిన అనంతరం వధూవరులు హోమం చూట్టూ ఏడూ ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే ఏడూ అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడూ జన్మల వరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమేనని చెబుతారు. అంతేకాకుండా ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్ధం కూడా ఉంది,

మొదటి అడుగు: అన్నవృద్దికి

రెండవ అడుగు: బల వృద్దికి

మూడవ అడుగు: ధన ప్రాప్తి

నాలుగో అడుగు: సుఖ వృద్దికి

అయిదో అడుగు: ప్రజా పాలనకి

ఆరో అడుగు: దాంపత్య జీవితానికి

ఎదో అడుగు: సంతాన అభివృద్ధికి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories