కొనసాగుతున్న శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్.. ఈనెల 11 నుంచి..

కొనసాగుతున్న శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్.. ఈనెల 11 నుంచి..
x
Highlights

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమలలో శ్రీవారి దర్శనం నిన్న పున:ప్రారంభం అయ్యింది. టీటీడీ ఉద్యోగులు, స్థానిక భక్తులతో ప్రయోగాత్మకంగా...

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమలలో శ్రీవారి దర్శనం నిన్న పున:ప్రారంభం అయ్యింది. టీటీడీ ఉద్యోగులు, స్థానిక భక్తులతో ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గంటకు ఐదు వందల మంది చొప్పున రోజుకు ఆరు వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 80 రోజులు మూతపడిన కలియుగ దైవం తిరుమల వెంకన్న ఆలయంలో తిరిగి భక్తుల దర్శనం ప్రారంభం అయ్యింది. వైభవోత్సవ మండపంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సుదీర్ఘ విరామం అనంతరం దర్శనాన్ని ప్రారంభిస్తుండడంతో శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని.. చూసి తరించారు.

మూడు రోజుల పాటు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ఈనెల 11 నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. స్వామివారి దర్శానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్క్ కచ్చితంగా ధరించాలనే నిబంధన విధించారు. తిరుమలలో శ్రీవారి దర్శనాల ట్రయల్‌ రన్‌ రెండో రోజు ప్రారంభమయింది. నేడు కూడా టీటీడీ ఉద్యోగులతో రాత్రి 7 గంటల వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. నిన్న శ్రీవారిని 6,360 మంది దర్శించుకోగా, నేడు మరో ఆరువేల మంది టీటీడీ ఉద్యోగులు దర్శించుకోనున్నారు. రేపు స్థానికులకు అవకాశం కల్పించనున్నారు.

తిరుమల స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 5500 టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేసింది. జూన్‌ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. దర్శనం టికెట్, టైమ్ స్లాట్‌ టోకెన్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం నుండి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక వీఐపీలు స్వయంగా వస్తనే అధికారులు దర్శనం చేయించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories