శ్రీవారి దర్శనానికి ఇవాళ్టి నుంచి టికెట్లు.. రేపట్నుంచి సామాన్య భక్తులకు అనుమతి..

శ్రీవారి దర్శనానికి ఇవాళ్టి నుంచి టికెట్లు.. రేపట్నుంచి సామాన్య భక్తులకు అనుమతి..
x
Highlights

తిరుమల శ్రీవారి దర్శనానికి రేపట్నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఆలయ ఉద్యోగులతో రెండు రోజులపాటు టీటీడీ నిర్వహించిన ట్రయల్‌ రన్ సక్సెస్ కావడంతో...

తిరుమల శ్రీవారి దర్శనానికి రేపట్నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఆలయ ఉద్యోగులతో రెండు రోజులపాటు టీటీడీ నిర్వహించిన ట్రయల్‌ రన్ సక్సెస్ కావడంతో ఈరోజు మరోసారి స్థానికులతో ట్రయల్ రన్ చేపట్టి రేపట్నుంచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అయితే, ట్రయల్ రన్‌లో మొదటిరోజు 6వేల 350మంది, రెండోరోజు 8వేల 342మంది ఉద్యోగులు స్వామివారిని దర్శించుకున్నారు. దాంతో, చాలాకాలం తర్వాత తిరుమల హుండీలో కానుకలు పడటంతో శ్రీవారికి 26లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రయోగాత్మకంగా సాగుతున్న దర్శన విధానాన్ని టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

శ్రీవారి దర్శనం చేసుకునేలా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఒకరోజు ముందే అంటే ఈ రోజు నుంచే టికెట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 18 కౌంటర్లలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. విష్ణు నివాసం వద్ద 8 కౌంటర్లు, శ్రీనివాసం దగ్గర 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7.30 గంటల నుండి టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఒక రోజు ముందుగానే తిరుపతిలో దర్శనం టికెట్లు పొందాల్సి ఉంటుంది. భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories