మెసేజ్ తో దర్శనం..టీటీడీ వినూత్న ఆలోచన

మెసేజ్ తో దర్శనం..టీటీడీ వినూత్న ఆలోచన
x
Highlights

దేవుని దర్శనాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలైనన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఇంతవరకు ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూనే కొత్త విధానాలకు తెర తీస్తున్నారు.

దేవుని దర్శనాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలైనన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఇంతవరకు ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూనే కొత్త విధానాలకు తెర తీస్తున్నారు.తాజాగా సోమవారం నుంచి ప్రారంభించిన దర్శనాల్లో భాగంగా కొత్తగా ఎస్,ఎం,ఎస్ ( మెసేజ్ ) విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ప్రతీ వ్యవస్థలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్నీ కూడా ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అన్‌లాక్‌ 1 నేపధ్యంలో ఏపీలోని అన్ని దేవాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. టీటీడీ కూడా తిరుపతిలో ఉన్న స్థానిక ఆలయాలన్నీ తెరిచింది.

ఇక ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత టికెట్లను ఇవ్వడంతో పాటు http://tirupatibalaji.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంతేకాక ఆలయాల్లో మిషన్ల నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లు జారీ చేస్తోంది. ప్రతీ ఆలయానికి ఓ కోడ్‌ను సూచించిన టీటీడీ ఎస్ఎంఎస్ పంపేటప్పుడు.. ఆ ఆలయం కోడ్‌తో పాటు దర్శనం చేసుకోవాలనుకునే తేదీ, భక్తుల సంఖ్యను వెల్లడించాలని తెలిపింది. అన్ని వివరాలతో 9321033330 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలని టీటీడీ సూచించింది. కాగా, ఆలయాలకు సంబంధించి కోడ్స్ ఈ విధంగా ఉన్నాయి.

♦ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూర్- SVP

♦ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం- SVS

♦ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలయగుంట- SVA

♦ శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి- SVG

♦ శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి- SVK

Show Full Article
Print Article
More On
Next Story
More Stories