తిరుమల శ్రీవారి సమాచారం: కొనసాగుతున్న భక్తుల రద్దీ

వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల విశేషాలు..

K V D Varma
Updated on: 28 Sept 2019 11:01 AM IST
తిరుమల శ్రీవారి సమాచారం: కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

(తిరుమల నుంచి హెచ్ఎంటీవీ ప్రతినిధి)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకప్రవేశ దర్శనానికి(300 రూ ఆన్‌లైన్) 3 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా దివ్యదర్శనం (కాలినడక భక్తులు), టైంస్లాట్ దర్శనాలకు 4 గంటల సమయం పడుతుంది.

ఇక నిన్న (శుక్రవారం) సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు 75,279 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. నిన్న అదే సమయంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ 2.98 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 17,271 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిని మ్రొక్కులు తీర్చుకున్నారు

K V D Varma

K V D Varma

Next Story